Friday, January 13, 2012

వీసా నిబంధనలు ఉల్లంఘిస్తున్న విదేశీయులు



ఇటీవలి కాలంలో వీసా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా క్రైస్తవ మత మార్పిళ్లను ప్రోత్సహించేందుకు అనేకమంది విదేశీయులు అక్రమ మార్గంలో భారత్ లోకి ప్రవేశిస్తున్నారు. 

భారత ప్రభుత్వం ఇక్కడికి వచ్చే విదేశీయులకు అనేక రకాల వీసాలు (వారి పనినిబట్టి) మంజూరు చేస్తుంది. అందులో ముఖ్యమైనవి వ్యాపారం, పర్యాటక, విద్యార్ధి, సమావేశ వీసాలు. ఇక్కడికి వచ్చిన విదేశీయులు ఏ వీసాపై వచ్చారో అందుకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే చక్కబెట్టుకుని వెళ్ళాలి. ఇతర కార్యక్రమాల్లో తలదూర్చడం చట్ట విరుద్ధం.  

అంటే చదువుకోవడానికి వచ్చి, ఉద్యోగ, వ్యాపారాలు చేయరాదు. ఉద్యోగం కోసం వచ్చి కోర్సుల్లో చేరకూడదు. అదేవిధంగా భారత్ లో విదేశీయులు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనటంపై నిషేధం ఉంది. ఇటువంటి కార్యక్రమాల కోసం వచ్చే వారికి భారత ప్రభుత్వంచే 'రెలిజియన్ వీసా' మంజూరు కావాల్సి ఉంటుంది. కానీ 1960 తరువాత ఇప్పటి వరకూ ప్రభుత్వం ఇటువంటి వీసాలు ఇవ్వడం మానేసింది. విదేశీయుల మత కార్యక్రమాలపై కఠినమైన నిషేధం విధించింది. దీంతో భారత్ కు వచ్చే విదేశీ క్రైస్తవ ప్రచారకులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు.  'రెలిజియన్ వీసా' మంజూరు కాదు కనుక పర్యాటకం, వ్యాపారం పేరిట భారత్ లోకి అడుగు పెడుతున్నారు. సేవ పేరుతో గ్రామాలు, పాఠశాలలు సందర్శిస్తున్నారు. 'దేవుడు' పేరు చెప్పి ప్రలోభాలకు గురి చేసి అమాయకులను మతం మారుస్తున్నారు.

భారతీయ వీసా నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చూసే బాధ్యత అధికారులతో పాటు ప్రజలపై కూడా ఉంటుంది. విదేశీయులు మత సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారన్న విషయం తెలిస్తే ఆ విషయాన్ని సమీపంలోని పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. వారి వీసా వివరాలు పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీపై ఉంటుంది.  

అక్రమ వీసాలు గల విదేశీ మిషనరీలను భారత్ నుండి పంపి వేసిన సంఘటనలు : 

పర్యాటక వీసాపై వచ్చిన అనేకమంది విదేశీయులను ఆయా సందర్భాలలో భారత్ నుండి పంపివేయడం జరుగుతూనే ఉంది. పరిశీలించగా తెలిసినదేమిటంటే ఆ ప్రాంతపు ప్రజలు గాని ఏదైనా సంస్థ గాని జాగరూకులై పోలీసు వారికి ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే ఇటువంటి చర్యలు తీసుకోబడ్డాయి. కాని నిజానికి పోలీసులు తమంత తామే ఇటువంటి చట్టవిరుద్ధ చర్యలు సాగించే విదేశీయులను పట్టుకుని దేశం నుండి బయటకు పంపివెయ్యవలసి ఉంటుంది.   

"ది హిందు" వార్తా పత్రికలో 2005 జూన్ 14 న ప్రచురించబడ్డ సమాచారం ప్రకారం ముంబాయిలోని మలాడ్ ప్రాంతంలో ఫిలిప్స్ ఎల్స్, క్లోవర్ ఎడ్వర్డు, రిచర్డ్ జేనవల్ అనే ముగ్గురు అమెరికన్ వ్యక్తులను, మరొక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి భారతదేశం నుండి బయటకు పంపివేశారు. ఎందుకంటే వారు మిషనరీ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు, కాని వారి వద్ద మిషనరీ వీసాలు లేవు. అయితే విదేశీయులపై ఒక స్థానిక ప్రజా సమూహం దాడి చేసినప్పుడు మాత్రమే పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఇలాంటి సంఘటనే మన ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమండ్రిలో ఒకటి జరిగింది. 

షాన్ అనే ఆస్ట్రేలియా మిషనరీ 2005 లో బిజినెస్ వీసాతో వచ్చి రాజమండ్రిలో మత ప్రచార సభలో పాల్గొనబోతే స్థానిక హిందువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతనిని వీసా నియమాల ఆధారంగా అడ్డుకొని వెనక్కు పంపివేయడం జరిగింది. 

2006  ఫిబ్రవరి 6  వ తేదీన కేరళలోని తిరువనంతపురం నుండి ముగ్గురు అమెరికన్ మిషనరీలను వీసా ఉల్లంఘన కారణంగా భారతదేశం నుండి పంపివేశారు. డేవిడ్ హేజ్, కార్ మైకేల్, టేలర్ డేవిడ్ లీ అనే పేర్లు గల ఈ విదేశీయుల వద్ద ఉన్నవి టూరిస్టు మరియు వ్యాపార వీసాలు మాత్రమే. కాని వాళ్ళు మాత్రం ఆ రాష్ట్రంలో మిషనరీ కార్యకలాపాలను సాగిస్తూ పట్టుబడ్డారు. "హిందూ ఐక్య వేదిక" వంటి సంస్థలు ఫిర్యాదు చేసిన పిమ్మటనే పోలీసులు ఆ చర్య తీసుకున్నారు.
 
వివిధ వీసా నియమాల ఉల్లంఘనలు, చట్టం తీసుకున్న చర్యలు : (వార్తా పత్రికల సమాచారం ఆధారంగా)
  • భారత ప్రభుత్వపు కాన్సులర్ ఇన్ఫర్మేషన్ షీట్ : ఏ విదేశీ పౌరుడు కూడా టూరిస్టు వీసాలు కలిగి ఉండి మిషనరీ కార్యకలాపాలు సాగించకూడదు. అలా చేసిన పక్షంలో అతడు దేశ బహిష్కరణకు, చట్ట పరమైన చర్యలకు గురి కావలసి వస్తుంది. మిషనరీ కార్యకలాపాలకు మిషనరీ వీసాలు మాత్రమే ఆమోదయోగ్యం. (1960  తరువాత భారత్ లో ఒక్క మిషనరీ వీసా కూడా ఆమోదించబడలేదు).
  • ఇండియన్ ఎక్స్ ప్రెస్ - 2008  జూలై 22  : ప్రార్థనల సందర్భంగా మతావేశాలను  రెచ్చగొట్టిన ఆరోపణపై ముగ్గురు అమెరికన్ పౌరులను విదేశీయుల చట్టం క్రింద అరెస్టు చేయడం జరిగింది. 
  • సిఫీ - 2006  ఫిబ్రవరి 2  : టూరిస్టు వీసాపై భారత్ వచ్చిన అమెరికన్ పౌరుడు మతమార్పిడి కార్యకలాపాలలో పాల్గొంటూ దొరికిన మీదట పోలీసులు అతడిపై తక్షణ చర్య తీసుకున్నారు.  

ప్రతి విదేశీయుడు తాను పర్యటించనున్న ప్రదేశంలోని జిల్లా ఎస్.పి.ని కలిసి తాను ఎక్కడ నివాసముండేది, తమ పాస్ పోర్టు, వీసాల విషయమై లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా విదేశీయునికి ఆశ్రయమిచ్చిన పౌరుడు, సంస్థ, హోటల్ వగైరా పోలీసులకు తమ వద్ద ఆశ్రమం పొందిన విదేశీయుని వివరాలను, స్థానిక పోలీస్ స్టేషన్ కు అందించాలి. ఈ నియమాల ఉల్లంఘనను ఎస్.పి. దృష్టికి తీసుకువచ్చి చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయవచ్చు.
 
- అయ్యలసోమయాజుల  

Note :  No religious visa was issued after 1960.It means no foreigner who is resorting to religious conversion or preaching at present holds a religious visa. Therefore all such activities are illegal.

 http://www.lokahitham.net/2011/11/blog-post_2688.html

No comments:

Post a Comment