Sunday, February 5, 2012

కాశ్మీర్ ను తాలిబనీకరణ చేస్తున్నారా!



గడిచిన కొద్ది సంవత్సరాలుగా కాశ్మీరుకు మరో క్రొత్త సమస్య ఎదురవుతున్నది. దాని పరిణామం శతాబ్దాలుగా ఉన్న సూఫీ సంప్రదాయమును చెల్లాచెదురు చేసి అరేబియా సాంస్కృతిక, మతపరమైన విధానాలను విస్తరింపచేయటానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న వేర్పాటు వాదంతో ఇప్పటికే సూఫీ సంప్రదాయం దెబ్బ తిన్నది. ఇప్పుడు మరింత దెబ్బ తినే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానితో రాబోయే రోజులలో కాశ్మీర్ లో సౌదీ అరేబియా సంస్కృతి నిర్మాణమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి.
 

1958లో జమైత్ అహ్ల్-ఇ-హదిత్ సంస్థ కాశ్మీర్ లోయలో తన పేరు నమోదు చేసుకొన్నది. ఆ సంస్థ వహాబీవాదం ధార్మిక సంక్షేమ సంస్థగా తనను తాను అభివర్ణించుకొంటున్నది. ఈ రోజున కాశ్మీర్ లోయలో 700 మసీదులు, అనేక మదరసాలు నడుస్తున్నాయి. ఈ మసీదులలో ప్రార్ధించేవారు సంప్రదాయబద్ధులైన చాందస వాదులు.  ఈ వహాబీ వాదం ప్రకారం మహిళలు బురఖా తప్పక ధరించాలి లేదా తలకు కనీసం గుడ్డ కట్టుకోవాలి. మగవారు గడ్డాలు తప్పక పెంచుకోవాలి. తలపై టోపీ ఉండాలి. వారు ధరించే సల్వార్లు కూడా పొడుగ్గా వహాబీ నియమాలకు అనుగుణంగా చీలమండలకు కాస్త ఎగువదాకా ఉండాలి.
 

ఈ రోజున కాశ్మీర్ లోయకు సౌదీ అరేబియా నుండి అనేక సంస్థలు, ప్రైవేట్ దాతలు భారీ ఎత్తున నిధులు తరలిస్తున్నారు. ఈ వహాబీ వాదంతో స్థానిక రాజకీయ నాయకులూ కూడా బెంబేలెత్తుతున్నారు. చారిత్రిక సూఫీ సంప్రదాయ మసీదుల పునరుద్ధరణకు నడుం కట్టిన హనాఫీ సంస్థ మాటలలో "శ్రీనగర్లో వేలాది మసీదులలో వహాబీ తత్వాన్ని బోధిస్తున్నారని" చెబుతున్నారు. కాశ్మీర్ కు చెందిన ముస్లిమేతర మైనార్టీలు సైతం ఈ వహాబీ వాదాన్ని "కాశ్మీరును తాలిబనీకరించే కుట్ర" గా భావిస్తున్నారు. పాకిస్తాన్లో కూడా మదర్సాలకు నిధులు అందిస్తున్న ఈ వహాబీ వాదం వారు అక్కడ తాలిబాన్లను తయారు చేస్తున్నారు. దానితో అక్కడ అంతర్గత కలహాలు పెరిగాయి. కాశ్మీర్లో కూడా తాలిబనీకరణ చేసి ముస్లిం చాందసవాదాన్ని మరింత పెంచాలని చూస్తున్నారు. ఇది మరో క్రొత్త సమస్య.  
 
 http://www.lokahitham.net/2011/12/blog-post_5330.html

No comments:

Post a Comment