హిందూ
పత్రిక ఇటీవల రొమిల్లా థాపర్ తో ఒక ఇంటర్వ్యూను ఒక పేజీ నిండుగా
ప్రచురించింది. డిల్లీ యూనివర్శిటీలోని సిలబస్ లో రామాయణ గాథపై వ్రాసిన ఒక
వ్యాసాన్ని తొలగించడం తప్పు అనేది ఆ ఇంటర్వ్యూ సారాంశం.
రామానుజం అనే చరిత్ర కారుడు రామాయణంలోని అనేక రకాల పుస్తకాలను ఉదహరించి రామాయణ గాధపై తప్పుడు అభిప్రాయం కలిగేలా వ్రాసిన వ్యాసం హిందువుల నమ్మకాలను కాలరాసి, చారిత్రిక సత్యాలను దూరం చేసే విధంగా ఉందని ఎబివిపి విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. డిగ్రీ విద్యార్థులకు సిలబస్ లో ఉన్న పాఠ్య అంశం చారిత్రిక సత్యాలతో కూడిన విషయాలతో నిండినదై ఉండాలి. కానీ వ్యక్తిగత సైద్ధాంతిక లక్ష్యాలతో, అనాదిగా వస్తున్న అభిప్రాయాలను కించపరిచే వ్యాసాలూ, పాఠాలను సిలబస్ లో చేరిస్తే, చదువుల అంతిమ లక్ష్యం దెబ్బ తింటుంది. దీనితో వారికి రామాయణంలోని చరిత్రను స్వయంగా విశ్లేషించే స్వాతంత్ర్యం లేకుండా పోతుంది. డిల్లీ విశ్వవిద్యాలయంలోని కొంతమంది ప్రొఫెసర్ల రాజకీయ సైద్ధాంతిక లక్ష్యాలతో చేర్చిన ఇటువంటి వ్యాసాలు విద్య ఎరుపీకరణలోను, పాశ్చాత్య ఆధిపత్యాన్ని సాధించడంలోనూ లక్ష్యాలుగా పని చేస్తాయని, ఇలాంటి వ్యాసాలను పాఠంలోని చరిత్రలో చేర్చరాదని, ఎబివిపికి చెందిన విద్యార్థులు 2008 లో ఆందోళన నిర్వహించారు. మూడేళ్ళ తరువాత యూనివర్శిటీ చరిత్ర విభాగం వ్యాసంపై ఒక కమిటీని వేసి విద్యార్థుల అభిప్రాయాలను గౌరవించి, తప్పుడు విశ్లేషణలతో కూడిన ఆ వ్యాసాన్ని తొలగించాలని నిర్ణయించింది.
ఏది
ఏమైనా తప్పుడు వ్యాసాలను సిలబస్ లో చేరిస్తే దేశభక్త విద్యార్థులు ఇంక
సహించి, అవే పాఠాలు చదవరని డిల్లీలోని ఎబివిపి విద్యార్థులు దేశంలోని
విద్యార్థులందరికీ ఒక మార్గాన్ని చూపించారు. దేశ వ్యాప్తంగా అన్ని
యూనివర్శిటీల్లో మన చదువులు మనం చదివే ప్రయత్నాలు తీవ్రం కావాలి. విద్యనూ
ఎరుపీకరించడం లేదా దానిపై పాశ్చాత్య ఆధిపత్యాన్ని స్థిరీకరించడం అనే బంధాల
నుంచి మన విద్యకు విముక్తి కల్పించాలి.
-జి.ఎల్.యెన్.
http://www.lokahitham.net/2011/11/blog-post_7348.html
No comments:
Post a Comment